
తిరుమల, 02 ఏప్రిల్ (హి.స.)
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమల తిరుపతిలో మరోసారి భక్తుల రద్దీ పెరిగింది. గురువారం ఉదయం శ్రీ వారి దర్శనం కోసం తిరుమలలో భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 7 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం (SSD) లభించడానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు వెల్లడించారు. భక్తులు తమ వంతు వచ్చే వరకు కంపార్ట్మెంట్లలో వేచి ఉండాలని కోరారు.
ఇదిలా ఉంటే బుధవారం రోజంతా కలిపి మొత్తం 69,649 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ 24,644 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 3.85 కోట్ల ఆదాయం సమకూరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV