
నంద్యాల 01 ఏప్రిల్ (హి.స.)నంద్యాల- గిద్దలూరు మార్గంలోని మలుపుల వద్ద మృత్యువు మాటేసింది.. గతేడాది కాలంలో 174 ప్రమాదాలు జరగ్గా.. 83 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. జిల్లా వాసులు అమరావతి, విజయవాడ, గుంటూరుకు ఈ మార్గంలో వెళ్తుంటారు. నిత్యం రెండు వేల వరకు వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. సెలవు రోజుల్లో రెట్టింపు ఉంటుంది. పూర్తిగా నల్లమల అటవీ మార్గంలో ఉంటుంది. మహానంది మండలం గాజులపల్లె అంకిరెడ్డి చెరువు మలుపు నుంచి 25 కి.మీ. మేర పూర్తిగా ఘాట్ రోడ్డు ఉండగా 43 మలుపులున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ