కోనసీమ.జిల్లాలో ఇసుక మట్టి దందా ఊహించని స్థాయిలో
అమరావతి, 01 ఏప్రిల్ (హి.స.)కోనసీమ జిల్లాలో ఇసుక, మట్టి దందా ఊహించని స్థాయిలో జరుగుతోందని టీడీపీ, జనసేన నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తనవద్ద అందుబాటులో ఉన్న నివేదికలతో పాటు ఇతర మార్గాల నుంచి కొత్త సమాచారం తెప్పించుకుంది. రీచ్ల్లో
కోనసీమ.జిల్లాలో ఇసుక మట్టి దందా ఊహించని స్థాయిలో


అమరావతి, 01 ఏప్రిల్ (హి.స.)కోనసీమ జిల్లాలో ఇసుక, మట్టి దందా ఊహించని స్థాయిలో జరుగుతోందని టీడీపీ, జనసేన నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వం తనవద్ద అందుబాటులో ఉన్న నివేదికలతో పాటు ఇతర మార్గాల నుంచి కొత్త సమాచారం తెప్పించుకుంది. రీచ్ల్లో తనిఖీలు నిర్వహించి సమగ్ర నివేదిక ఇవ్వాలని గనులశాఖ డైరెక్టర్ డబ్ల్యూబీసీ చంద్రశేఖర్ను ఆదేశించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు కోనసీమ జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన నేతలు ముందుకొచ్చారు.

మంగళవారం నలుగురు టీడీపీ నేతలు, ఓ జనసేన నేత ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. వీరిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏపీ రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఐడీసీ) చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ తదితరులు ఉన్నారు. ఇసుక, మట్టి అక్రమాలపై మరిన్ని కొత్త అంశాలను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande