సామాన్యులపై మరో పిడుగు.. రాష్ట్రంలో పాల ధరల పెంపు
ఆంధ్రప్రదేశ్ లో విజయ పాల డైరీ లీటర్ పాలపై 2రూపాయలని పెంచింది .
సామాన్యులపై మరో పిడుగు.. రాష్ట్రంలో పాల ధరల పెంపు


అమారాతి, 01 ఏప్రిల్ (హి.స.)

నిత్యావసర వస్తువుల ధరల భారంతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరో పిడుగు పడింది. ఏపీ(Ap)లో ప్రముఖ డెయిరీ సంస్థ విజయ పాలధరలను పెంచింది. లీటర్ పాలపై రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ ప్రకటించింది. పాల సేకరణ ఖర్చులు, ప్యాకేజింగ్ మెటీరియల్ ధరలు, రవాణా భారం పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని డెయిరీ వర్గాలు తెలిపాయి. పెరిగిన ఈ ధరలు తక్షణమే అమలులోకి రానున్నాయని పేర్కొన్నాయి.

అయితే ఈ నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్పై అదనంగా భారం పడనుంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande