
ఢిల్లీ, 01 ఏప్రిల్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు 'ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) బిల్లు - 2026'ను నేడు లోక్ సభలో ప్రవేశపెట్టగా, సభ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో అమరావతి భవిష్యత్తుపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అనిశ్చితికి తెరపడినట్లయింది.
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రక విజయమని, రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు దక్కిన గొప్ప గౌరవమని ఆయన అభివర్ణించారు.
కోట్లాది ఆంధ్రుల స్వప్నానికి అండగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలకు సుజనా చౌదరి తన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా, ఈ బిల్లుకు మద్దతు తెలిపిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో పాటు ఇతర రాజకీయ పార్టీల సభ్యులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV