ఏలూరు జిల్లా అలిగిరి మండలం హీల్ప్యారడైజ్ పాఠశాలలో 11 వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు
ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తులు
ఏలూరు జిల్లా అలిగిరి మండలం హీల్ప్యారడైజ్ పాఠశాలలో 11 వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు


ఆగిరిపల్లి, 10 ఏప్రిల్ (హి.స.)

నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, వసతి, భోజనం అందించే హీల్ ప్యారడైజ్ పాఠశాలలో 11వ తరగతి (ఇంటర్మీడియట్) ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హీల్ సీఈవో కె.అజయ్ కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో 90 ఎకరాల సువిశాల ప్రాంగణంలో డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు. ‘ఆంగ్ల మాధ్యమంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈఏ గ్రూపుల్లో 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు హీల్ ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత తప్పనిసరి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. పదో తరగతిలో 480 మార్కులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ విద్యార్థులు 400పైన మార్కులు సాధించి ఉండాలి. తెల్లరేషన్ కార్డు, ఆదాయ ధ్రువపత్రం తప్పనిసరి’ అని అజయ్ కుమార్ వివరించారు. ఈ అర్హతలు ఉన్నవారు మే 18లోపు దరఖాస్తు చేసుకోవాలి అని అన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande