తుంగతుర్తి మండలం తూర్పుగూడెం జిల్లా పరిషత్ పాఠశాల లో భిన్న పరిస్తితి
8 మంది విద్యార్థులు.. 6గురు టీచర్స్
తుంగతుర్తి మండలం తూర్పుగూడెం జిల్లా పరిషత్ పాఠశాల లో భిన్న పరిస్తితి


తుంగతుర్తి , 10 ఏప్రిల్ (హి.స.)

సర్కారు బడుల్లో సాధారణంగా ఉపాధ్యాయులు తక్కువ.. విద్యార్థులు తుంగతుర్తి ఎక్కువగా ఉండటం ఆనవాయితీ. తుంగతుర్తి మండలం తూర్పుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఆరో తరగతిలో ఒక్కరు, ఏడులో ఇద్దరు, ఎనిమిదిలో ముగ్గురు, తొమ్మిదిలో ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీరికి బోధించడానికి ఆరుగురు ఉపాధ్యాయులు ఉండటం విశేషం. టీచర్లు నిత్యం బడికి వస్తున్నా.. ఉన్న కొద్దిపాటి పిల్లలూ సక్రమంగా పాఠశాలకు రావడం లేదు. ప్రేయర్ సమయంలో ఆరుగురు ఉపాధ్యాయులు హాజరవగా విద్యార్థులు ముగ్గురే వచ్చారు. గ్రామంలో ఆరు నుంచి పది వరకు చదివే విద్యార్థులు మొత్తం 36 మంది ఉండగా.. 18 మంది ఆదర్శ పాఠశాలకు, మరో 10 మంది వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్నట్లు ప్రధానోపాధ్యాయుడు వెంకట్రెడ్డి తెలిపారు. మరోవైపు ఇదే జిల్లా మద్దిరాల మండలం పోలుమల్లలోని పీఎంశ్రీ ప్రాథమిక పాఠశాలలో 97మంది విద్యార్థులకు నలుగురే ఉపాధ్యాయులు ఉన్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఇలాంటి పరిస్థితే ఉంది. వచ్చే విద్యాసంవత్సరంలోనైనా విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande