అమరావతి ప్రపంచస్థాయి క్వాంటం హబ్ గా మారుతోంది
క్వాంటం హబ్ గా అమరావతి
అమరావతి ప్రపంచస్థాయి క్వాంటం హబ్ గా మారుతోంది


అమరావతి, 10 ఏప్రిల్ (హి.స.)

అమరావతి ప్రపంచ స్థాయి క్వాంటమ్ హబ్గా మారుతోంది. ఈ భవిష్యత్ టెక్నాలజీలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రెండేళ్లలో క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేయాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలో భాగంగా.. ఇప్పటికే రెండు చిన్న కంప్యూటర్లు సిద్ధమయ్యాయి. క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ పనితీరుపై పరిశోధనలు చేసేందుకు ఆ రెండు కంప్యూటర్లను ప్రత్యేకంగా ‘టెస్ట్ బెడ్స్’గా వినియోగించనున్నారు. ఈ పరిశోధనలు చేసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఆ వివరాలను విజయవాడలో నిర్వహించిన మీడియా అవగాహన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న వెల్లడించారు. రాష్ట్రంలో రెండేళ్లలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటమ్ కంప్యూటర్లు అందుబాటులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఈనెల 14న ప్రపంచ క్వాంటమ్ కంప్యూటర్ దినోత్సవం సందర్భంగా రెండు టెస్టింగ్ ల్యాబ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు దేశానికి అంకితమిస్తారని వెల్లడించారు. దేశంలో తొలిసారిగా ఇలా క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ ల్యాబ్లను ఒకటి ఎస్ఆర్ఎం వర్సిటీలో.. రెండోది గన్నవరం మేధా టవర్స్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ఈ రెండు క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ద్వారా.. కొత్తగా తయారు చేసిన క్వాంటమ్ కంప్యూటర్ల పనితీరును నిర్ధారణ చేయవచ్చని ప్రద్యుమ్న వెల్లడించారు. క్వాంటమ్ వ్యాలీలో ప్రధానంగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ (ఆల్గారిథమ్స్), స్కిల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్, పార్టనర్షి్పలు ఉంటాయని వివరించారు. రెండేళ్లలో అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటర్లను ఉత్పత్తిని చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లుగా ఇప్పుడు రెండు క్వాంటమ్ కంప్యూటర్లను హార్డ్వేర్ పరిశోధన కోసం తయారు చేశామన్నారు. ఈ రెండు తయారయ్యాక అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయడం సాధ్యమేనన్న ధీమా కలిగిందన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ నుంచి హార్డ్వేర్, ఆల్గారిథమ్స్తో కూడిన సాఫ్ట్వేర్ను ప్రపంచానికి అందించగమన్న నమ్మకం కుదిరిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande