రహదారి మీద క్యూ ఆర్ స్కాన్బో ర్డులు
క్యూ ఆర్ స్కాన్ బోర్డులు పెట్టారు
రహదారి మీద క్యూ ఆర్ స్కాన్బో ర్డులు


అమరావతి, 10 ఏప్రిల్ (హి.స.)

ఏ రహదారిపై వెళ్లినా ‘ఎదుట మలుపు ఉంది’, ‘పనులు జరుగుతున్నాయి’ ‘నెమ్మదిగా వెళ్లండి’ అని అప్రమత్తం చేసే సూచికలు చూస్తుంటాం. అదే.. అన్నమయ్య జిల్లా మదనపల్లె నుంచి తిరుపతి జిల్లా నాయుడుపేటకు జాతీయ రహదారి-71 మీదుగా వెళ్తుంటే దారెంట క్యూఆర్ కోడ్ బోర్డులు కనిపిస్తాయి. సెల్ఫోన్తో వాటిని స్కాన్ చేస్తే ఆ మార్గంలో లభ్యమయ్యే సేవలు, రోడ్డు వివరాలు ప్రత్యక్షమవుతాయి. పనుల్లో పారదర్శకత కోసం, సేవల కోసం జాతీయ రహదారుల అధికారులే ఈ ఏర్పాటుచేశారు. రోడ్డేసిన గుత్తేదారు, రహదారి నాణ్యత తెలిపే సమాచారం తెలుసుకోవచ్చు. టోల్గేట్లు, హోటళ్లు, అత్యవసర విభాగాలు ఎంత దూరంలో ఉన్నాయి.. ముఖ్యమైన సేవల ఫోన్ నంబర్లూ ఉంటాయి. అటుగా వెళ్తే మీరూ ఓ సారి స్కాన్ చేసి చూడండి!

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande