కృష్ణా జిల్లా లోని గుడివాడ ప్రాంతానికి చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకు గురి
హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఇంజనీర్
కృష్ణా జిల్లా లోని గుడివాడ ప్రాంతానికి చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకు గురి


అమరావతి, 10 ఏప్రిల్ (హి.స.)

కృష్ణా జిల్లాలోని గుడివాడ ప్రాంతానికి చెందిన ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. గుడివాడ బేతవోలు గ్రామానికి చెందిన బండ్ల ఋషికేష్ (27) హర్యానాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందినట్లు సమాచారం. ఋషికేష్ ఇటీవలే హర్యానాలోని పంచకులలో ఉన్న అమరావతి ఎన్క్లేవ్లోని ఒక ప్రైవేట్ ఐటీ సంస్థలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగం వచ్చిన పది రోజులు కూడా పూర్తికాకముందే ఈ దారుణం చోటుచేసుకోవడం కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

కంపెనీ ఏర్పాటు చేసిన నివాస గదిలోనే ఋషికేష్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై సమాచారం గుడివాడ వన్టౌన్ పోలీసులు బాధిత కుటుంబానికి తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande