ఏంటి ఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ పై అధికారులు ప్రత్యేక దృష్టి
బస్సు ప్రమాదాలను నివారించడానికి బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్ర
ఏంటి ఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ పై అధికారులు ప్రత్యేక దృష్టి


ఎన్టీఆర్ జిల్లా, 10 ఏప్రిల్ (హి.స.)

ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బ్లాక్ స్పాట్స్(రోడ్డు ప్రమాద ప్రదేశాలు) పరిశీలన బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ లక్ష్మీ , డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షరీన్ బేగం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, కేతనకొండ గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మొత్తం 28 బ్లాక్ స్పాట్స్ను గుర్తించారు. రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్న ప్రాంతాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటిని సురక్షిత ప్రాంతాలుగా మార్చడానికి తగు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

ఈ బస్సు యాత్ర కార్యక్రమం ద్వారా అధికారులు ప్రత్యక్షంగా రోడ్లను పరిశీలించారు. కేతనకొండ, ఇబ్రహీంపట్నం నుంచి గొల్లపూడి, వారధి, ఎనికెపాడు 24కే కల్యాణ మండపం వరకు పర్యటించిన అధికారులు.. అక్కడి రోడ్డు పరిస్థితులను సమీక్షించారు. ఈ ప్రాంతాల్లో వాహనాల వేగం, రోడ్డు వంపులు, ట్రాఫిక్ సమస్యలు తదితర కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు గమనించారు.

ఈ బస్సు యాత్ర కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా అంతటా విస్తృతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇది రోడ్డు ప్రమాదాల రేటును తగ్గించడంలో ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande