'ఆర్థికంగా ఇబ్బంది ఉన్న రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం: మంత్రి అడ్లూరి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
మంత్రి అడ్డలూరి


జగిత్యాల, 10 ఏప్రిల్ (హి.స.)

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు మద్దతు ధర ప్రకటించడం తప్ప కొనుగోలు విషయంలో రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించడం లేదని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... రైతులు పంట మార్పిడిలో భాగంగా జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేశారని మంత్రి తెలిపారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటలు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నప్పటికీ రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రూ. 2400 క్వింటాల్ మక్కలు కొనుగోలు చేస్తున్నామని మంత్రి వివరించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజోన్న కొనుగోలు కేంద్రాలతో రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ. 500 కోట్ల భారం పడుతుందని మంత్రి తెలిపారు. ప్రజల కోసం బాధ్యతగా పనిచేస్తున్న ప్రభుత్వం కనుక రైతుల కొరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కోరుట్ల నియోజకవర్గంలోని నాలుగు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. రైతులు ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా మొక్కజొన్నలు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని మంతి సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande