వాహనం సీజు చేసే రైట్స్ పోలీసులకు లేదు.. హైకోర్టు కీలక ఆదేశాలు
వాహనం సీట్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తెలిపింది
High court


హైదరాబాద్, 10 ఏప్రిల్ (హి.స.)

వాహనదారులకు ఊరటనిచ్చేలా

తెలంగాణ హైకోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk and Drive) కేసుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది. తనిఖీల్లో ఎవరైనా మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే, పోలీసులు వారి వాహనాన్ని సీజ్ చేయకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినంత మాత్రాన మోటారు వాహనాల చట్టం కింద వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదని కోర్టు తేల్చి చెప్పింది. వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం తాగి ఉన్నట్లు నిర్ధారణ అయితే, ఆ సమయంలో అతనితో పాటు ఉన్న మద్యం తాగని స్నేహితులకు లేదా బంధువులకు వాహనాన్ని అప్పగించాలని కోర్టు పేర్కొంది.

ఒకవేళ స్పాట్లో ఎవరూ లేని పక్షంలో సదరు వ్యక్తికి సంబంధించిన బంధువులు లేదా స్నేహితులకు ఫోన్ చేసి అక్కడికి పిలిపించి వాహనాన్ని వారికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. నిబంధనల ప్రకారం డ్రైవర్పై చలానా వేయడం లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడం చేయాలి తప్ప, వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించకూడదని ధర్మాసనం పోలీసులకు సూచించింది.

చాలా సందర్భాల్లో పోలీసులు వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనం సీజ్ చేయడం వల్ల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కంటే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నారనే వాదనల నేపథ్యంలో హైకోర్టు ఈ స్పష్టత ఇచ్చింది. రోడ్డుపై వాహనాలను నిలిపివేసి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని, చట్టం పరిధిలో ఉన్న వినియోగించుకోవాలని అధికారాలను మాత్రమే హైకోర్టు పోలీసులను ఆదేశించింది

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande