ఏపీ ప్రజలకు అలర్ట్...ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం
Rain


అమరావతి, 10 ఏప్రిల్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రతి రోజు చాలా ప్రాంతాలలో 40కి పైగా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే ఈ క్రమంలో కొన్ని జిల్లాలలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ద్రోణి ప్రభావంతో విశాఖపట్నం, అనకా పల్లి, కాకినాడ, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలకు అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఇలాంటి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరింది.

శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాల్పులు, రాయలసీమ జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande