
రామగుండం, 10 ఏప్రిల్ (హి.స.)
రామగుండం సెక్టార్లోని అంగన్వాడీ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న నాగమల్యాల స్వర్ణలత, తనపై అధికారుల పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలాడినట్లు ఫిర్యాదులు అందాయని, ఈ ప్రవర్తన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యమని ప్రాథమిక విచారణలో తేలిందని, ఉన్నతాధికారుల నివేదికలు అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి సదరు అంగన్వాడీ టీచర్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఈ సస్సెన్షన్ ఆదేశాలు సదరు టీచర్పై పూర్తి స్థాయి విచారణ పూర్తై తదుపరి చర్యలు తీసుకునేంత వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, క్రమశిక్షణ తప్పినా కఠిన చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi