
హైదరాబాద్, 10 ఏప్రిల్ (హి.స.)కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిపవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అస్సాం
పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనకుఒక వారం పాటు
ముందస్తు బెయిల్మంజూరు చేస్తూ హైకోర్టు నేడు (ఏప్రిల్ 10, 2026) కీలక తీర్పునిచ్చింది.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్యరినికి భుయాన్ శర్మపై పవన్ ఖేరా
గతంలో తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు మూడు వేర్వేరు దేశాల పాస్పోర్ట్లు ఉన్నాయని, విదేశాల్లో భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఆయన
విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అస్సాం పోలీసులు, గౌహతి క్రైమ్ బ్రాంచ్లో ఖేరాపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 175, 35, 318 కింద కేసు నమోదు
చేశారు.
అస్సాం పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని
భావించిన పవన్ ఖేరా, తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య హైదరాబాద్లో
నివసిస్తున్నారని, అందుకే ఇక్కడ పిటిషన్ దాఖలు చేశానని ఆయన కోర్టుకు
తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi