తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 21 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల


తిరుమల, 10 ఏప్రిల్ (హి.స.)

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఏడుకొండలు కోలాహలంగా మారాయి. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి (SSD) సుమారు 6 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ (TTD) అధికారులు నిరంతరం అన్నప్రసాదం, తాగునీరు, పాలు పంపిణీ చేస్తున్నారు.నిన్న స్వామివారిని 64,136 మంది భక్తులు దర్శించుకున్నారు. మొక్కులు తీర్చుకోవడంలో భాగంగా 23,255 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande