
నాగర్ కర్నూల్, 10 ఏప్రిల్ (హి.స.)
అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ మంజూరు ఇళ్లు కల్పిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శుక్రవారం వారు నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ప్రతులు అందజేశారు. అలాగే దాసి శివప్రసాద్ ఇంటి నిర్మాణాలకు మంత్రి భూమి పూజ చేశారు. దాసి సునీత, కడ్తల తిరుపతమ్మకు సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
గత ప్రభుత్వంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వంలో గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..