
ఆచంట, 10 ఏప్రిల్ (హి.స.)
ఆచంట మండలం కొడమంచిలిలో మనవరాలి వయసున్న ఆరేళ్ల బాలికపై ఓ 70 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడిని పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా రోడ్డుపై అక్రమంగా నిర్మించిన షాపును సైతం బుల్డోజర్తో నేలమట్టం చేశారు. పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేత పడడ్బందీగా జరిగింది. మహిళలు, చిన్నారుల భద్రత విషయంలో రాజీ పడేది లేదని హెచ్చరిస్తూ.. నిందితుడు అఘాయిత్యానికి పాల్పడిన ఆ షాపును జేసీబీతో కూల్చివేసినట్లుగా. నేరస్థుల్లో వణుకు పుట్టించేలా పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం స్థానికంగా సంచలనంగా మారింది.
చిన్నారులు, మహిళలపై అనుచితంగా ప్రవర్తించినా, అఘాయిత్యాలకు పాల్పడినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అన్నారు. అలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాకుండా, వారి ఆస్తులు, అక్రమ కట్టడాలపై కూడా చర్యలు తీసుకుంటా పోలీసు ఉన్నతాధికారులు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV