మత విద్వేషాలకు బ్రేక్.. ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లు డిలీట్ .. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల
తప్పుడుఫేస్ బుక్ ఎకౌంట్లను గుర్తించి తొలగించిన ఎస్పీ జానకి షర్మిల
SP


నిర్మల్, 10 ఏప్రిల్ (హి.స.) నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో గత కొంతకాలంగా కొంతమంది దుండగులు తప్పుడు ఫేస్బుక్ అకౌంట్లను సృష్టించి, మార్ఫ్ చేసిన వీడియోలు మత విద్వేషాలకు దారితీసే పోస్టులు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా ప్రచారం చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందిందనీ, ఈ నేపథ్యంలో పలువురి పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, రెండు తప్పుడు ఫేస్బుక్ అకౌంట్లను గుర్తించి, ఆ రెండు ఫేస్ బుక్ అకౌంట్లను తొలగించడం జరిగిందని, త్వరలోనే అట్టి అకౌంట్లను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ఎవరైనా సోషల్ మీడియాలో అనుమానాస్పద, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని, శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande