
వరంగల్, 10 ఏప్రిల్ (హి.స.)
ప్రజాపాలన-ప్రగతి 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆరోగ్య థీమ్ - డే 5 సందర్భంగా శుక్రవారం ప్రపంచ హోమియోపతి దినోత్సవం & ఆయుష్ దినోత్సవం వేడుకలు ఖిలా వరంగల్లో ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వయంభూ దేవాలయం వద్ద నిర్వహించిన యోగ ప్రదర్శనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగ ద్వారా శారీరక—మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.అదనపు కలెక్టర్ రెవెన్యూ జి సంధ్యారాణి, జడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, వరంగల్ నర్సంపేట ఆర్డీవోలు సుమ ఉమారాణిలు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు పాటు ఆయుష్ డాక్టర్స్, పాల్గొన్నారు. అనంతరం ముదిరాజ్ భవన్లో ఆయుష్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..