
మహారాణి పేట , 11 ఏప్రిల్ (హి.స.)
వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఆత్మహత్యాయత్నం కేసులో ఆయనకు జైలు శిక్షతోపాటు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ రైల్వే కోర్టు తీర్పు ఇచ్చింది. 2016 ఏప్రిల్లో ఆయన విశాఖలో రైల్వే జోన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను కేజీహెచ్కు తరలించారు. ఈ క్రమంలో ఆత్మహత్యాయత్నం నేరం కింద అప్పటి టూటౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారు. నేరం రుజువు కావడంతో రైల్వే కోర్టు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ వరలక్ష్మి తీర్పు వెలువరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ