ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత
ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు కీలక నిర్ణయం తీసుకున్న apsrtc
ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత


అమరావతి, 11 ఏప్రిల్ (హి.స.)

ఏపీఎస్ఆర్టీసీ తమ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు కీలక నిర్ణయం తీసుకుంది. 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ పిరియాడికల్ హెల్త్ చెకప్ అమలును తప్పనిసరి చేస్తున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. ఇటీవల ఉద్యోగుల్లో.. ముఖ్యంగా డ్రైవర్లలో గుండె సంబంధిత సమస్యలు, ఇతర వ్యాధుల కారణంగా మరణాలు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో వారికి ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం డ్రైవర్లకే పిరియాడికల్ హెల్త్ చెక్పలు నిర్వహిస్తున్నారు. ఇకపై 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులందరికీ ప్రతి ఆరు నెలలకొకసారి హెల్త్ చెకప్ తప్పనిసరి చేసినట్టు తెలిపారు. మే 1 నుంచి ఈ కార్యక్రమం అన్ని డిపోల్లోనూ అమలులోకి వస్తుందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande