
కోదాడ , 11 ఏప్రిల్ (హి.స.)
ఇటీవల బస్ ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. ఎందరో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రైవేట్ బస్సు లు ఎక్కాలంటేనే జనం భయపడిపోతున్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్ర మత్తులోనే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ