
విజయనగరం, 11 ఏప్రిల్ (హి.స.)విజయనగరం జిల్లాలో టీడీపీ మహానాడు కార్యక్రమం నిర్వహణకు మూడుచోట్ల స్థలాలను పరిశీలించారు. శుక్రవారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఉత్తరాంధ్ర టీడీపీ పరిశీలకుడు పి.శ్రీనివాస్రెడ్డి, ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్ దామచర్ల సత్య, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వ యకర్త ఎం.సత్యనారాయణ స్థలాల పరిశీలనలో పాల్గొన్నారు.
నెల్లిమర్ల నియో జకవర్గం భోగాపురం మండలం నాతవలస సమీపంలోని కోట భోగాపురం, జాతీయ రహదారి నుంచి నందిగాం వెళ్లే రహదారి పక్కన, అలాగే అవనాం జంక్షన్ సమీపంలోని స్థలాలను వారు చూశారు. వీటితో పాటు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని పైడిభీమవరం ఆనుకుని ఉన్న మరో స్థలాన్ని కూడా పరిశీలించారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, మహానాడును మరింత ఉత్సాహంగా జరిపేందుకు అధిష్ఠానం నిర్ణయించిందన్నారు.
ఈనెల 17వ తేదీన మరోసారి టీడీపీ నాయకులు విజయనగరం జిల్లాలో పర్యటించి వేదికను ఖరారు చేయనున్నారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ