
అమరావతి, 11 ఏప్రిల్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో వేసవి సెలవుల కారణంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిలిచిపోకుండా, కూటమి ప్రభుత్వం 'డ్రై రేషన్' పంపిణీకి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే నిరుపేద విద్యార్థులు వేసవి సెలవుల్లో పౌష్టికాహారానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ఏపీ కూటమి ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. సాధారణంగా పాఠశాలలు ఉన్నప్పుడు మధ్యాహ్న భోజనం అందుతుంది, కానీ సెలవుల్లోనూ వారి ఇంటికే రేషన్ పంపే డ్రై రేషన్ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రభుత్వం చేపట్టింది.
రాష్ట్రంలోని కరువు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు సెలవుల్లో పౌష్టికాహార లోపానికి గురికాకుండా చూడటమే ఈ పథకం లక్ష్యం. ముఖ్యంగా అనంతపురం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాల్లోని 51 కరువు మండలాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఎంపిక చేసిన కరువు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 9 తరగతులు పూర్తి చేసిన విద్యార్థులందరికీ ఈ డ్రై రేషన్ అందజేస్తారు. ప్రాథమిక స్థాయి (1-5 తరగతులు) ఉన్నత పాఠశాల స్థాయి (6-9 తరగతులు) విద్యార్థులకు ఈ డ్రై రేషన్ అందిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ