ఇంటర్ విద్యార్థులకు BIG అప్డేట్.. వాట్సాప్లోనే ఫలితాలు..
వాట్సాప్ లోనే ఇంటర్ ఫలితాలు
Inter results


హైదరాబాద్, 11 ఏప్రిల్ (హి.స.)

రేపు విడుదల కాబోతున్న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫలితాలను విద్యార్థులు నేరుగా తమ మొబైల్లోనే పొందే వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫలితాల కోసం విద్యార్థులు ఎటువంటి పోర్టల్ లాగిన్ అవసరం లేకుండా, మీసేవ కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. గతంలో ఇదే పద్ధతిలో లక్షలాది మంది విద్యార్థులకు హాల్ టికెట్లు విజయవంతంగా పంపిణీ చేయబడగా ఇప్పుడు ఫలితాలను సైతం సులభంగా తెలుసుకునేందుకు అధికారులు వెల్లడించారు. అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

మొదట మీ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ నంబర్ 8096 95 8096 నంబర్ను సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పంపాలి. సర్వీస్ ఎంపికలో మెనూలో BIE Exam Result అని టైప్ చేసి, 'Open Service' అనే ఆప్షన్ నొక్కాలి.అక్కడ మీ హాల్ టికెట్ (రోల్) నంబర్ నమోదు చేసి సంవత్సరం(1st/2nd Year), (General/Vocational) ఎంచుకోవాలి. వివరాలు సమర్పించిన వెంటనే మీ ఫలితం మెసేజ్ రూపంలో తక్షణమే స్క్రీన్పై ప్రత్యక్షమవుతుంది.

రాష్ట్రంలో మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఐటీ శాఖ 18 నవంబర్ 2025న ఈ మీసేవ వాట్సాప్ చాట్బాట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అతి తక్కువ కాలంలో ప్రజల నుంచి విశేషమైన ఆదరణ పొందుతున్న ఈ చాట్ బాట్ ద్వారా ప్రస్తుతం 580కి పైగా ప్రభుత్వ సేవలను పౌరులకు చేరువచేస్తోంది. ఈ కోవలోనే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫలితాలను అందించడంతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఇదో గొప్ప ఊరటగా మారనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande