అక్రమంగా తరలిస్తున్న 450 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు
Reshan rice


భద్రాద్రి కొత్తగూడెం, 11 ఏప్రిల్ (హి.స.)

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పై పౌరసరఫరాల శాఖాధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా శనివారం తెల్లవారుజామున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం బోడ్ గ్రామ సమీపంలో లారీలో తరలిస్తున్న సుమారు 250 క్వింటాళ్ల బియ్యాన్ని, ఇల్లెందు పట్టణం కోట మైసమ్మ తల్లి దేవాలయం సమీపంలో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు.

పట్టుకున్న రేషన్ బియ్యాన్ని లక్ష్మీదేవిపల్లిలోని గోడౌన్కు తరలించారు. టేకులపల్లిలో పట్టుకున్న లారీ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినదిగా గుర్తించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని అతని సెల్ ఫోన్ చెక్ చేయగా కారేపల్లి మండలంలో బియ్యం మాఫియాలో పేరు గడించిన గౌతం పుష్ప అనే వ్యక్తిగా తేల్చారు. ఇక ఇల్లెందులో పట్టుకున్న లారీ తెలంగాణకు చెందిందని లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో పౌరసరఫరాల డీటీలు మహేష్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు. శాఖ

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande