కేసీఆర్ విష కౌగిలిలోకి జీవన్రెడ్డి.. ఆది శ్రీనివాస్ విమర్శలు
జీవన్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన ఆది శ్రీనివాస్
Adi Srinivas


హైదరాబాద్, 11 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి జీవన్రెడ్డి వ్యవహారం హాట్గాపిక్గా మారింది. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన జీవన్ బీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నిన్న ఆయన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను (KCR) కలిశారు. ఈ నేపథ్యంలో జీవన్రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. జీవన్ రెడ్డి 4 దశాబ్దాలుగా అండగా నిలిచిన పార్టీని వదిలి కేసీఆర్ విష కౌగిలిలోకి వెళ్లారని విమర్శించారు. కేసీఆర్ రాక్షస, అవినీతి పాలనపై పదేళ్లు పోరాటం చేశానని జీవన్ రెడ్డి చెప్పుకున్నారు. ఇప్పుడు కలిసి పని చేయాలని దేవుడు ఎలా ఎంపిస్తాడు అని ప్రశ్నించారు. అవినీతిపరులతో కలిసి పని చేయమని ఏ దేవుడైనా చెబుతాడా? అని నిలదీశారు. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకోవడం లేదని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande