జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతుండడంతో భారీ బహిరంగ సభ జరగనుంది
జగిత్యాలలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ


జగిత్యాల, 11 ఏప్రిల్ (హి.స.)

జగిత్యాలలో ఈనెల 20వ తేదీ సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ కోసం గులాబీ శ్రేణులు సమరోత్సాహంతో సిద్ధమవుతున్నాయి. సుమారు లక్ష మంది జనసమీకరణే లక్ష్యంగా పార్టీ నాయకత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు సంబంధించి అనువైన ప్రదేశాన్ని ఖరారు చేసేందుకు ఈరోజు పార్టీ ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత తదితరులు కలిసి జగిత్యాలలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల మైదానం, ఓల్డ్ బస్టాండ్ సమీపంలోని కాలేజీ గ్రౌండ్, మోతే రోడ్డు ప్రాంతాలను నిశితంగా పరిశీలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande