పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు ఇవ్వొద్దు.. మంత్రి సీతక్క హెచ్చరిక
ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలోమాట్లాడిన సీతక్క
సీతక్క


ములుగు, 11 ఏప్రిల్ (హి.స.)

పిల్లలకు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు ఇవ్వకుండా మంచి పౌష్టికాహారం అందించే విధంగా చూడాలని, పౌష్టికాహారం విలువలు తెలియజేయడానికే రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని మంత్రి దనసరి అనసూయ(సీతక్క) అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఐలవు ములుగు అనే స్వాగత తోరణం వద్ద పోషకాహారంపై వివరించడానికి నిర్వహించనున్న ర్యాలీని మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ఈ నెల 9 నుంచి 23వ తేదీ వరకు పోషక విలువలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, సరి అయిన పోషక ఆహారం తీసుకోకపోవడం వల్ల పిల్లలు అనేక వ్యాధుల బారిన పడుతుండగా గర్భిణీ స్త్రీలు బాలింతలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ఐసిడిఎస్ ద్వారా నాణ్యమైన పోషక విలువలు కలిగిన పదార్థాలను అందించడానికి చర్యలు తీసుకుందని, అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే అవగాహన నిర్వహించడం జరిగిందని వివరించారు. ప్రతి ఒక్కరు ఆహార పదార్థాలు తీసుకుంటున్న సందర్భంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, శుభ్రమైన నీటిని సేవించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande