
వరంగల్, 11 ఏప్రిల్ (హి.స.)
మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి ఉత్సవాల సందర్భంగా వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు వద్ద గల మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య, తదితరులు పాల్గొని మహాత్మా ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కృషి ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రజాప్రతినిధులు మహాత్మా జ్యోతిరావు ఫూలే సేవలను స్మరించుకుంటూ, ఆయన సమాజ సంస్కరణల కోసం చేసిన చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి మార్గదర్శకమని తెలిపారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, మహాత్మా ఫూలే ఆశయాలను సాధించేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు