రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.నాయుడు. జిల్లాకు చెందిన ఎమ్యేలతో ప్రత్యేక భేటీ
ఎమ్మెల్యే లతో ప్రత్యేక భేటీ అయిన చంద్రబాబు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు.నాయుడు. జిల్లాకు చెందిన ఎమ్యేలతో ప్రత్యేక భేటీ


కాకినాడ , 12 ఏప్రిల్ (హి.స.)

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో అమరావతిలో ప్రత్యేక భేటీ నిర్వహించారు. జిల్లాల వారీగా నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్పై సమీక్షిస్తున్న సీఎం కాకినాడ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సుధీర్ఘంగా చర్చించారు. సమీక్షకు ఎమ్మెల్యేలు యనమల దివ్య, వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీ, వనమాడి కొండబాబు, పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, పెదపూడి మండలం నుంచి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాజులూరు మండలం నుంచి మంత్రి సుభాష్, తాళ్లరేవు మండలం నుంచి దాట్ల బుచ్చిబాబు, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి.నారాయణ, కలెక్టర్ హరేంధిరప్రసాద్, ఎస్పీ బిందుమాధవ్ హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 9 గంటల వరకు సాగింది. జిల్లాలో పలు నియోజకవర్గాల ప్రగతిని ప్రస్తావించారు. మిగతా ఎమ్మెల్యేలను పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. నియోజకవర్గాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని సీఎం భరోసా ఇవ్వడంతో జిల్లా ప్రజాప్రతినిధుల మాటల్లో జోష్ కనిపించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande