
అమరావతి, 12 ఏప్రిల్ (హి.స.)
తిరుపతి (తితిదే), : రెండో శనివారం, ఆదివారం నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి. నడక మార్గంలోనూ రద్దీ అధికంగా ఉంటోంది. మరోవైపు ఎండవేడితో భక్తులు తల్లడిల్లిపోతున్నారు. టోకెన్ల పంపిణీ కేంద్రాలు, వసతి కేంద్రాలు, నడక మార్గాల్లో తాగునీరు, మజ్జిగ, ఆహారపదార్థాలు వంటివి నిరంతరం అందించాలని భక్తులు, చంటిబిడ్డల తల్లులు, వృద్ధులు కోరుతున్నారు.
తిరుపతి నుంచి అలిపిరి తనిఖీ కేంద్రం మీదుగా తిరుమలకు శనివారం రాత్రి 11 గంటల వరకు మొత్తం 10,726 వాహనాలు వెళ్లాయి. ఆర్టీసీ బస్సులు 928, కార్లు, జీవులు 8,485, తితిదే వాహనాలు 68, ప్రభుత్వ వాహనాలు 37, ఆరు చక్రాల వాహనాలు 65, ద్విచక్ర వాహనాలు 1,143 ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ