నగరంలో నీ. క్విస్ ఇంజనీరింగ్.కాలేజీ విద్యార్దిని. శివ కుమారి ప్రధాని.మోడీతో. సంభాషించే అవకాశం
ఒంగోలు12 ఏప్రిల్ (హి.స.)నగరంలోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఈసీఈ మొదటి సంవత్సరం విద్యార్థిని శివకుమారికి ప్రధాని నరేంద్రమోదీతో వర్చువల్గా సంభాషించే అవకాశం దక్కింది. మై భారత్ ప్రకాశం సహకారంతో నిర్వహిస్తున్న యువత సాధికారత కార్యక్రమంలో భాగంగా
నగరంలో నీ. క్విస్ ఇంజనీరింగ్.కాలేజీ విద్యార్దిని. శివ కుమారి ప్రధాని.మోడీతో. సంభాషించే అవకాశం


ఒంగోలు12 ఏప్రిల్ (హి.స.)నగరంలోని క్విస్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఈసీఈ మొదటి సంవత్సరం విద్యార్థిని శివకుమారికి ప్రధాని నరేంద్రమోదీతో వర్చువల్గా సంభాషించే అవకాశం దక్కింది. మై భారత్ ప్రకాశం సహకారంతో నిర్వహిస్తున్న యువత సాధికారత కార్యక్రమంలో భాగంగా ఆమె ఎంపికైంది. ఈ కార్యక్రమం గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆది, సోమవారాల్లో జరగనుంది. దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం దీనికి రూపకల్పన చేసింది. ఈ సందర్భంగా శివకుమారిని కళాశాల ఛైర్మన్ నిడమానూరి సూర్యకళ్యాణ చక్రవర్తి, వైస్ ఛైర్పర్సన్ డాక్టర్ గాయత్రీదేవి, అకడమిక్ డీన్ సత్యమెహర్, మొదటి సంవత్సరం హెచ్వోడీ గంటా శ్రీనివాసరావు అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande