పల్నాడు జిల్లా లో ఆదివారం తెల్లవారు జామున రెండు రోడ్డు ప్రమాదాలు
రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాలు
పల్నాడు జిల్లా లో  ఆదివారం తెల్లవారు జామున రెండు  రోడ్డు ప్రమాదాలు


పల్నాడు, 12 ఏప్రిల్ (హి.స.)

జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఘటనలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో భార్య అంకమ్మ(38) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. భర్త వెంకయ్య తృటిలో తప్పించుకున్నాడు. దంపతులిద్దరూ గుంటూరులో వివాహానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులది రాజుపాలెం మండలం అంచులవారిపాలెంగా పోలీసులు గుర్తించారు.

సత్తెనపల్లి మండలం నందిగం క్రాస్ రోడ్డు వద్ద మరో ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన బొలెరో ట్రక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, ఇతర వాహనదారులు వెంటనే 108, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో బాధితులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నర్సాపురం నుంచి సత్తెనపల్లి వెళ్తుండగా బొలెరో ట్రక్ ప్రమాదానికి గురైంది. మత్స్యకారులంతా ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు చెరువులో రొయ్యలు పట్టేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande