అచ్యుతాపురం కస్తూర్బా విద్యాలయంలో చదువుతున్న ఏదో తరగతి విద్యార్ది మృతి
అనకాపల్లి, 12 ఏప్రిల్ (హి.స.)అచ్యుతాపురం కస్తూర్బా విద్యాలయంలో చదువుకుంటున్న ఏడోతరగతి విద్యార్థిని మృతిచెందింది. డార్మెటరీలో నిద్రిస్తున్న విద్యార్థినిని విషపురుగు కాటేసినా సకాలంలో గుర్తించకపోగా.. ఆసుపత్రికి తరలించకుండా సిబ్బంది వహించిన నిర్లక్ష్యం
అచ్యుతాపురం కస్తూర్బా విద్యాలయంలో చదువుతున్న ఏదో తరగతి విద్యార్ది మృతి


అనకాపల్లి, 12 ఏప్రిల్ (హి.స.)అచ్యుతాపురం కస్తూర్బా విద్యాలయంలో చదువుకుంటున్న ఏడోతరగతి విద్యార్థిని మృతిచెందింది. డార్మెటరీలో నిద్రిస్తున్న విద్యార్థినిని విషపురుగు కాటేసినా సకాలంలో గుర్తించకపోగా.. ఆసుపత్రికి తరలించకుండా సిబ్బంది వహించిన నిర్లక్ష్యం ఈ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. బంధువులు, సహ విద్యార్థుల కథనం ప్రకారం..

పూడిమడకకు చెందిన ఎల్లమ్మ, రాజులది మత్స్యకార కుటుంబం. చేపల వేటే వీరికి బతుకుదెరువు. వీరి కుమార్తె మైలపల్లి నవ్య కస్తూర్బా విద్యాలయంలో చదువుతోంది. రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి భోజనం చేసి సహవిద్యార్థులతో కలిసి నిద్రించిన నవ్య చేతిపై అర్థరాత్రి దాటిన తరవాత ఏదో కుట్టింది. వెంటనే నొప్పితో లేచి తల్లడిల్లుతూ సిబ్బందికి సమస్యను వివరించింది. చీమ గానీ, కందిరీగ గానీ కుట్టి ఉంటుందని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. నొప్పి వస్తోందని చెప్పినా ఉల్లిపాయ రాసి నిద్రపోవాలని చెప్పి ఆమె గోడు పట్టించుకోలేదు. తెల్లవారి నొప్పి ఎక్కువయిందని.. చెప్పినా స్నానం చేశాక తగ్గిపోతుందని మరింత నిర్లక్ష్యం ప్రదర్శించారు. నొప్పి భరించలేకపోతున్నానని.. ఊపిరి అందడం లేదని, తండ్రికి ఫోన్ చేసి చెప్పాలని కోరినా విధుల్లో ఉన్న సిబ్బంది లెక్క చేయలేదు. శనివారం ఉదయం 6 గంటలకు అచ్యుతాపురంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి అనకాపల్లి జిల్లా ఆసుపత్రికి, కేజీహెచ్కి తరలించారు. కేజీహెచ్లో చికిత్స పొందుతూ నవ్య శనివారం మధ్యాహ్నం మృతి చెందింది.

.. :నవ్యను విషపురుగు కుట్టిన నాలుగు గంటల వరకు వైద్యసేవలు అందలేదు. ఉదయం 6 గంటలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడంతో అప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోవడంతో ప్రయోజనం లేకపోయింది. పాఠశాల ప్రాంగణంలోకి తరచూ పాములు వస్తున్నాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ముందే ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

:ప్రభుత్వం విద్యార్థుల కోసం మంచాలు అందించినా వీటిని ఉపయోగించడంలేదు. అందరిని నేలపైనే నిద్రపుచ్చడం వల్లే ఈ సంఘటన జరిగింది.

మంచి చదువు కోసం కేజీబీవీలో చేర్పిస్తే విగతజీవిగా తమకు అప్పగించారంటూ తల్లి ఎల్లమ్మ, బంధువులు పాఠశాల గేటుముందు బైఠాయించి రోదించారు. వారం కిందట పుష్పవతి వేడుక ఘనంగా నిర్వహించి పాఠశాలకు పంపిస్తే... ఇంతలోనే నిర్లక్ష్యం తమ బిడ్డను మింగేసిందన్నారు. కుటుంబానికి పరిహారం ఇవ్వడంతోపాటు విచారణ నిర్వహించి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ నాయకులు సోమునాయుడు కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande