ఎల్లారెడ్డిపేట లో బరి తెగించిన దొంగలు ఏకంగా 5 క్వింటాళ్ల బరువైన ఏ టీ ఏం నీ ఎత్తుకెళ్లారు
ఏకంగా ఏటీఎం నే ఎత్తుకెళ్లిన దొంగలు
ఎల్లారెడ్డిపేట లో బరి తెగించిన దొంగలు ఏకంగా 5 క్వింటాళ్ల బరువైన  ఏ టీ ఏం నీ ఎత్తుకెళ్లారు


ఎల్లారెడ్డిపేట, 12 ఏప్రిల్ (హి.స.)

బరితెగించిన దొంగలు ఏకంగా 5 క్వింటాళ్ల బరువైన ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. పోలీస్స్టేషన్కు కేవలం వంద గజాల దూరంలో అర్ధరాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. ఎస్పీ మహేశ్ బి.గితె స్వయంగా రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐలు, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్సైలతో ఏడు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఏటీఎంలో రూ.6,06,100 నగదు ఉన్నట్లు గుర్తించారు. దొంగలు డబ్బు తీసుకొని ఖాళీ యంత్రాన్ని అక్కపల్లి శివారులో పడేశారు. పోలీసులు, బ్యాంకు అధికారులు తెలిపిన ప్రకారం... నిన్న సాయంత్రం 4.40 గంటలకు ఎస్బీఐ ఏటీఎంలో నగదు డిపాజిట్ చేశారు. అదేరోజు అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఏటీఎం వద్దకు చేరుకొని, తలుపును ఇనుప రాడ్తో తీశారు. సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్డిస్క్, సెన్సార్లు, ఇతర పరికరాలను ధ్వంసం చేశారు. ఏటీఎంకు తాళ్లు కట్టి, సరకులు తీసుకెళ్లే వాహనంతో లాగడంతో అది ఊడి వచ్చినట్టు తెలుస్తోంది. సైరన్ వ్యవస్థలో సాంకేతిక సమస్యతో దొంగల పని తేలికైంది. హిటాచి క్యాష్ టెక్నికల్ డిపార్ట్మెంట్ మేనేజర్ రమేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాహుల్రెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande