కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
kalyana lakshmi


బూర్గంపహాడ్, 12 ఏప్రిల్ (హి.స.)

బూర్గంపహాడ్ మండలంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు. ఈ సందర్భంగా తాసీల్దార్ కార్యాలయంలో జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. తొలుత బూర్గంపహాడ్లోని రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాలలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం స్కూల్ యాజమాన్యం పలు సమస్యలపై వినతిపత్రం అందజేయగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా బూర్గంపహాడ్ పంచాయతీ గౌతాపురంలో తల్లపురెడ్డి నాగేశ్వరి, నీరుడు రమణ లబ్దిదారుల ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశంలో పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande