
హైదరాబాద్, 12 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ క్రీడాకారులు మరోసారి జాతీయ స్థాయిలో తమ ప్రతిభను చాటారు. ఒడిశాలోని కటక్ నగరంలో జరిగిన 1వ ఆల్ ఇండియా ఇండోర్ రోయింగ్ ఛాంపియన్షిప్ 2026లో తెలంగాణ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచి. అండర్-15 విభాగంలో రన్నరప్గా నిలిచింది. ఏప్రిల్ 8 నుండి 11 వరకు జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రానికి చెందిన యువ రోయర్లు కఠినమైన సవాళ్లను అధిగమిస్తూ, మొత్తం పతకాలను (2 బంగారు, 3 వెండి, 2 కాంస్య) కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో అండర్-15 కేటగిరీలో దేశవ్యాప్తంగా తెలంగాణ దక్కించుకోవడం విశేషం. 7 రెండో స్థానాన్ని
ఈ ఛాంపియన్షిప్లో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, తెలంగాణ ట్రైబల్ స్కూల్, హైదరాబాద్ సిటీ రోయర్ల నుండి మొత్తం 23 మంది సభ్యుల బృందం పాల్గొంది. జట్టు లీడర్ జి. గీతాంజలి నేతృత్వంలో ఈ క్రీడాకారులు అత్యంత క్రమశిక్షణతో ప్రదర్శన చేశారు. భారత్లో జరిగిన మొట్టమొదటి ఆల్ ఇండియా ఇండోర్ రోయింగ్ ఈవెంట్ కావడంతో, ఇది మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. పటిష్టమైన ఒడిశా జట్టు మెజారిటీ బంగారు పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ యువ రోయర్లు వారికి గట్టి పోటీనిచ్చి రెండో స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..