నేడు విడుదల కానున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల, వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు
Inter results


హైదరాబాద్, 12 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల

నిరీక్షణకు నేడు తెరపడనుంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలు ఈరోజు ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల కానున్నాయి. సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్షల ఫలితాలను, నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రానా విడుదల చేయనున్నారు. మార్చి 13న పరీక్షలు ముగిసిన నెల రోజుల వ్యవధిలోనే బోర్డు ఫలితాలను ప్రకటించడం విశేషం. కాగా విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ www.tgbie.cgg.gov.in ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

అంతేకాదు ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. శనివారం సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఈ సర్వీసును ప్రారంభించారు. స్మార్ట్ఫోన్ నుండి 8096958096 నంబర్కు వాట్సాప్లో 'bie' అని మెసేజ్ పంపాలి. తదుపరి దశలో వచ్చే సూచనల మేరకు మీ రోల్ నంబర్, సంవత్సరం, గ్రూప్ వివరాలను నమోదు చేస్తే, ఫలితాలు నేరుగా వాట్సాప్లో అందుతాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande