
పాలమూరు, 12 ఏప్రిల్ (హి.స.)
పాలమూరు రైతులకు నష్టం కలిగించే డిండి ఎత్తిపోతలను రద్దుచేయాలని ఉమ్మడి జిల్లా జేఏసీ అధ్యక్షుడు రాజేందర్రెడ్డి, పాలమూరు అధ్యాయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. వంగూరు మండలంలోని ఉల్పర నుంచి డిండి-చింతపల్లి వరకు డీఎల్ఐ కాల్వను జేఏసీ బృందం పరిశీలించింది. అనంతరం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భూములు కోల్పోయేది పాలమూరు రైతులు, నీళ్లు పారేది నల్గొండకైతే ఇక్కడి పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పర్యావరణ అనుమతులు, డీపీఆర్ లేకుండా ప్రాజెక్టు ఎలా చేపడుతారని వారు మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi