
అమరావతి, 12 ఏప్రిల్ (హి.స.)
EE Main 2026 అభ్యర్థులకు కీలక అప్డేట్ వెలువడింది. మొదటి సెషన్ కు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీతో పాటు, అభ్యర్థుల రికార్డెడ్ రెస్పాన్స్ షీట్లు, ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లో అందుబాటులో ఉంచారు.
అప్లికేషన్ నెంబరుతోపాటు, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి రెస్పీన్స్ షీట్, ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థులు ఆన్సర్ కీలో ఏవైనా తప్పులు ఉన్నాయని భావిస్తే, ఆబ్జెక్షన్ విండో (Objection Window) ద్వారా అభ్యంతరాలను సమర్పించవచ్చు.
ఈ ప్రక్రియ కోసం ప్రతి ప్రశ్నకు రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆబ్జెక్షన్ విండో సాధారణంగా 2 నుండి 3 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించిన తర్వాత, ఫైనల్ ఆన్సర్ కీతో పాటు, సెషన్ 2 ఫలితాలను ఏప్రిల్ 20 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV