నేడు మంచిర్యాలకు కేటీఆర్
కార్యకర్తల సమావేశానికి రానున్న కేటీఆర్
ktr


మంచిర్యాల, 12 ఏప్రిల్ (హి.స.)

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు(ఆదివారం) మంచిర్యాల జిల్లాకు రానున్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్, రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్రావు వేర్వేరుగా పరిశీలించి, శ్రేణులకు సలహాలు, సూచనలు చేశారు. బీఆర్ఎస్ భవన్లో చేస్తున్న ఏర్పాట్లపై పట్టణ కమిటీ నాయకులతో చర్చించారు. శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేటీఆర్కు ఘనస్వాగతం పలికి, పర్యటనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వేదిక, షామియానాలు, తాగునీరు, సౌండ్ సిస్టం, జనరేటర్, పార్కింగ్ సదుపాయాలు కల్పించాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande