శారీరక దృఢత్వానికి వాకింగ్ వంటి అలవాట్లు ఎంతో ఉపయోగకరం.. మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి అన్నారు
శారీరక దృఢత్వానికి వాకింగ్ వంటి అలవాట్లు ఎంతో ఉపయోగకరమని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి అన్నారు
walking


జగిత్యాల 12 ఏప్రిల్ (హి.స.)

శారీరక దృఢత్వానికి వాకింగ్ వంటి అలవాట్లు ఎంతో ఉపయోగకరమని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ సమీండ్ల వాణి అన్నారు. జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో నిర్వహించిన డెయిలీ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వ సభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజువారీ వ్యాయామం చేయాలని సూచించారు.వివేకానంద మినీ స్టేడియంలో వాకర్స్కు అవసరమైన సౌకర్యాల అభివృద్ధికి మున్సిపాలిటీ తరఫున తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ సభ్యులు తమ సమస్యలు, అవసరాలను చైర్ పర్సన్కు వివరించగా, వాటిని ప్రాధాన్యతగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అరవ లక్ష్మి, అసోసియేషన్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, వాకర్స్ పాల్గొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande