
న్యూఢిల్లీ, 13 ఏప్రిల్ (హి.స.) కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం దేశం ముందున్న అసలైన సవాలు మహిళా రిజర్వేషన్లు కాదని, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియే అత్యంత కీలకమైన అంశమని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో రాసిన వ్యాసంలో ఆమె తన అభిప్రాయాలను పంచుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమని, අධි రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడి అని సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. లోక్ సభ స్థానాల సంఖ్యను పెంచే క్రమంలో అన్ని రాష్ట్రాలకు రాజకీయంగా సమాన ప్రాధాన్యత ఉండాలని ఆమె డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును -2024 (The Women's Reservation Bill - 2024) అమలు చేయాలని ప్రతిపక్షాలు కోరినప్పుడు నిరాకరించిన ప్రధాని మోదీ, ఇప్పుడు 2029 నుంచి అమలు చేస్తామని చెప్పడం ఆయన 'యూ-టర్న్'కు నిదర్శనమని విమర్శించారు. దీని కోసం ఇప్పుడు హడావుడిగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. దేశంలో కుల గణనను (Caste Census) అడ్డుకోవడమే ప్రధాని అసలు ఉద్దేశమని సోనియా ఆరోపించారు. జనాభా గణన పేరుతో కులగణనను ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రత్యేక సమావేశాలు పిలవడం వెనుక ప్రతిపక్షాలను డిఫెన్స్లో నెట్టాలనే రాజకీయ వ్యూహం ఉందని ఆమె
పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..