
న్యూఢిల్లీ, 13 ఏప్రిల్ (హి.స.)
పశ్చిమాసియా (West Asia)లో
పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇరాన్ (Iran) న్యూక్లియర్ ప్రోగ్రాంపై అమెరికా (America), ఇరాన్ మధ్య పాకిస్థాన్లో జరిగిన చర్చలు ఎటువంటి ఒప్పందం లేకుండా ముగియడంతో పరిస్థితి విషమించింది. ఈ క్రమంలోనే ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ ఓడరేవులపై నావిక దిగ్బంధనం(Naval Blockade) విధిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ పరిణామంతో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో పశ్చిమ దిశలో 15 భారతీయ నౌకలు చిక్కుకుపోయాయి. అందులో అత్యధికంగా ఎల్ఎన్ఆ (LNG), ఎల్పీజీ (LPG), ముడి చమురు ట్యాంకర్లు, కంటైనర్ నౌకలు ఉన్నాయి
కాగా, సోమవారం మధ్యాహ్నం నుంచి ఇరాన్ ఓడరేవుల నుంచి వచ్చిపోయే అన్ని దేశాల అడ్డుకుంటామని నౌకలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. దీంతో ఈ మార్గంలో నౌకల రాకపోకలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. భారతీయ వాణిజ్య నౌకల భద్రతను పర్యవేక్షించేందుకు భారత నావికాదళానికి చెందిన సుమారు ఆరు యుద్ధ నౌకలు పర్షియన్ గల్ఫ్ సమీపంలో మోహరించాయి. నిలిచిపోయిన నౌకల సిబ్బందితో నేవీ అధికారులు నిరంతరం టచ్లో ఉన్నారు. ఉద్రిక్తతల మధ్యే 'జగ్ విక్రమ్' అనే భారతీయ ఎల్పీజీ ట్యాంకర్ ఏప్రిల్ 11న హార్మూజ్ జలసంధిని దాటి ముంబైకి బయలుదేరగా.. అది ఏప్రిల్ 15న భారత్కు చేరుకోనుంది. మరోవైపు, ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. అమెరికా జల దిగ్బంధనం చేస్తే తాము హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేసి శ్రతువులకు మృత్యు సుడిగుండం చూపిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు