పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. కాంగ్రెస్ ఎంపీలకు ‘విప్' జారీ
కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలందరికీ కీలక ఆదేశాలు జారీ చేసింది
Congress


న్యూఢిల్లీ, 13 ఏప్రిల్ (హి.స.)

ఈ నెల 16 నుంచి 18 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎంపీలందరికీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రత్యేక సెషన్ల సమయంలో లోక్సభలో తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ అధిష్టానం ఎంపీలకు 'విప్' (Whip) జారీ చేసింది. సభ జరిగే మూడు రోజులు ఎంపీలు అందుబాటులో ఉండాలని, పార్టీ తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరించాలని చీఫ్ విప్ స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు తో పాటు పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో, విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం హఠాత్తుగా ఈ ప్రత్యేక సమావేశాలను పిలవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 16 నుంచి ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో దేశవ్యాప్త ప్రభావం చూపే కొన్ని వివాదాస్పద బిల్లులు, కీలక నిర్ణయాలను కేంద్రం సభ ముందు ఉంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ వ్యూహాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ తమ బలాన్ని సభలో నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సభలో చర్చలు వాడివేడిగా జరిగే సూచనలు కనిపిస్తుండటం తో, రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande