స్టాక్ మార్కెట్లలో బ్లాక్ మండే.. 1400 పాయింట్ల పైగా కుప్పకూలిన సెన్సెక్స్
కుప్పకూలిన సెన్సెక్స్
Stock market


హైదరాబాద్, 13 ఏప్రిల్ (హి.స.) అమెరికా- ఇరాన్ శాంతి చర్చలు

, విఫలం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల, మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (సోమవారం) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల పవనాల నేపథ్యంలో సెన్సెక్స్ ప్రారంభంలోనే 1,446.37 పాయింట్లు పతనమై 76,103.88 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 405.90 పాయింట్లు కోల్పోయి 23,644.70 వద్ద కొనసాగుతోంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు కుదేలయ్యాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న మార్కెట్లకు ఈ భారీ పతనం ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో మదుపర్లు ఆందోళనకు గురవుతున్నారు.

ఈ భారీ పతనానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే ఎక్కువగా ఉండటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించకపోవచ్చనే సంకేతాలు గ్లోబల్ మార్కెట్ పై ప్రభావం చూపాయి. దీనికి తోడు పశ్చిమ ఆసియాలో (Middle East) పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) భారత మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం (Profit Booking) వంటి అంశాలు మార్కెట్లను పాతాళానికి నెట్టాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande