
న్యూఢిల్లీ, 13 ఏప్రిల్ (హి.స.)
దేశవ్యాప్తంగా నకిలీ ఓట్లకు చెక్ పెట్టి,
voting) ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటు వేయకుండా (Duplicate నిరోధించేందుకు బయోమెట్రిక్ వ్యవస్థ (Biometric system)ను ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ఈ రోజు సుప్రీంకోర్టు (Supreme Court) విచారణకు స్వీకరించింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై తమ వివరణ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం భారత ఎన్నికల సంఘానికి (ECI) నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం ఉన్న సిరా గుర్తు (Indelible Ink) విధానం నకిలీ ఓట్లను పూర్తిగా అరికట్టలేక పోతోందని, ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న తరుణంలో వేలిముద్రలు, ఐరిస్ (Iris) స్కానింగ్ వంటి బయోమెట్రిక్ పద్ధతులను పోలింగ్ స్టేషన్లలో అమలు చేయాలని పిటిషనర్ కోరారు. ఓటు వేయడానికి ముందు ఓటరు బయోమెట్రిక్ వివరాలను ఆధార్, ఇతర డేటాబేస్తో సరిపోల్చడం ద్వారా అక్రమాలకు తావులేకుండా చేయవచ్చని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు.
ఈ ప్రతిపాదనపై ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. బయోమెట్రిక్ వ్యవస్థను అమలు చేయడం వల్ల ఓటర్ల గోప్యతకు కలిగే ముప్పు, మౌలిక సదుపాయాల కల్పన, అయ్యే ఖర్చు వంటి అంశాలపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి, ఈసీకి సూచించింది. తదుపరి విచారణను మరికొన్ని వారాలకు వాయిదా వేసింది. ఒకవేళ ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే, భారత ఎన్నికల చరిత్రలో ఇది ఒక మైలురాయిగా నిలవనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..